'ఏంటండీ మీరూ చనిపోయారా ?' అంతకు ముందే చనిపోయి దెయ్యంగా మారిన భార్య అంది భర్త తో .
' అవునే ... నువ్వు చనిపోయిన వెంటనే నా ప్రాణమూ పోయింది . ఒక్కోసారి అమితానందం కూడా ప్రాణం తీస్తుందనిఅర్ధం అయ్యింది ' బాధగా చెప్పాడా భర్త .
7. బాసురులు
- మీరు చేస్తే 'తప్పు' ... అదే మీ బాసు చేస్తే 'పొరబాటు'.
- ఏదైనా పని చెయ్యడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటే మీరు ' మరీ నిదానస్తులు ' . అదే బాస్ అయితే ' ఆచి తూచి ఆలోచించి పని చేస్తారు '.
- చెప్పిన పని చెప్పిన సమయానికి మీరు చెయ్యలేకపోతే అది 'బద్ధకం'. బాస్ గారు చెయ్యలేక పొతే , ఆయన బిజీ గా వున్నట్లు .
- కొంచెం స్వతంత్రించి నిర్ణయం తీసుకుంటే మీరు హద్దులు మీరుతున్నట్లే లెక్క . అదే పని అధికారి చేస్తే 'చొరవ ' అయిపోతుంది .
- మీరు ఒకే మాటకు కట్టుబడితే అది 'మొండితనం '. అయ్యవారు చేస్తే ... ఆయన మాట మీద నిలబడే మనిషి .
- మీరు మీ బాస్ ని ప్రసన్నం చేసుకోబోతే అది ' కాకా పట్టడం ' . అదేపని బాస్ పైవారి పట్ల చేస్తే అది 'కో -ఆపరేషన్ '.
8 కొంటె కొటేషన్
దారి కాచి అటకాయించే దొంగలు జీవితం, డబ్బుఈ రెండింటిలో ఏది కావాలో తేల్చుకో అని బెదిరిస్తుంటారు . కాని భార్యఅ ఛాన్స్ ఇవ్వదు.
9. ఎలకల బోను
ప్రేమ అనేది ఎలకల బోను లాంటిది. లోపలికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కాని అందులోంచి బయటపడటం ఓ పట్టాన కుదరదు. కొన్ని సార్లు ఎప్పటికీ సాధ్యం కాదు.
10. మంచి వార్త....!!
హాస్పిటల్ కు చెకప్ కోసం వెళ్ళిన పంకజం ముఖం వేలాడేసుకొని ఇంటికి తిరిగి వచ్చింది.
' ఒక మంచి వార్త , ఒక చెడ్డ వార్త' అని చెప్పింది భర్తతో.
' ఏమిటది?'
' నా మాట పడిపోతుందట. ఇంకా ఒకటి రెండు రోజులే నేను మాట్లాడగలిగేది...' దిగాలుగా అంది.
' అవునా?! మరి చెడ్డ వార్తేమిటి ? అడిగాడు భర్త
No comments:
Post a Comment