11. ఉచిత సలహా
కాలు విరిగిన వ్యక్తిని పరీక్షిస్తున్నాడు డాక్టర్ వెంగళప్ప.
' రెండు చోట్ల విరిగిందని నా అనుమానం డాక్టర్.' చెప్పాడు ఆ వ్యక్తి బాధగా.
'తెలిసొచ్చింది కదా... ఆ రెండు చోట్లకూ మళ్ళీ ఇంకెప్పుడూ వెళ్ళకండి.' సలహా ఇచ్చాడు వెంగళప్ప.
12. తెలిసి తెలిసీ ..
మొదటి సారి తన బాయ్ ఫ్రెండ్ శ్రీను తో పిక్నిక్ కు వెళ్ళింది లీల. అక్కడ ఏకాంత వాతావరణం లో శ్రీను ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత లీల కుమిలి పోతూ ఏడవటం ప్రారంభించింది.
'వద్దూ వద్దనుకుంటూనే పొరబాటు చేశా. పాపమని తెలిసీ మళ్ళీ అదే తప్పు ... నాకు నిష్కృతి లేదు' అంది లీల ఆవేశంగా.
'అదేంటి మనం తప్పు చేసింది ఒక్కసారేగా?! ఆశ్చర్యంగా అన్నాడు శ్రీను.
'ఇంటికేళ్లేలోపు ఇంకోసారి అవేశాపడక పోతావా?' నమ్మకం గా అంది లీల.
13. ఆడవాళ్లకు మాత్రమే
సేవింగ్స బాండ్ కి మగ వారికి తేడా..?
సేవింగ్స్ బాండ్ కొన్నేళ్ళకైనా మెచ్యూర్ అవుతుంది.
మగ వాళ్ళకీ పార్కింగ్ స్థలాలకీ పోలిక?
మంచివన్నీ ముందే అయిపోతాయి. మిగిలి ఉన్న వాటికి ఎదో లోపం/ సమస్య ఉంటుంది.
క్యాండిల్ లైట్ డిన్నర్ గురించి మగవాళ్ళు ఆలోచించే దెప్పుడు
కరెంట్ పోయినప్పుడు ( వాళ్ళకు రొమాంటిక్ థాట్స్ కూడానా!)
చక్కగా డ్రెస్ చేసుకున్న మగవాణ్ణి చూడగానే ఏమనిపిస్తుంది ?
ఇతని భార్యకు మంచి టేస్ట్ ఉంది , డ్రెస్ సెలక్షన్ బాగా తెలుసూ ... అని.
ఆడవాళ్ళు తెలివిగా కన్పించే కన్నా, అందంగా కనిపించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారెందుకు?
మగవాళ్ళకు బుర్ర లేక పోయినా కళ్ళుంటాయికదా.
14. క్షమించేద్దాం
అడవిలో నాలుగు చీమలు వెళ్తున్నాయి. తోవలో వాటికీ ఏనుగు ఎదురైంది. ఎవరు పక్కకు తోలగాలనే సమస్య తలెత్తింది. మర్యాదగా అడ్డు లెమ్మంది గజ రాజు.
'మనల్నే ఎదిరిస్తుందా? దీన్ని చంపి తీరుతాను ' ఆవేశపడిందో చీమ.
'ఎందుకు? కాళ్ళు విరగ్గొడితే సరి ' సలహా ఇచ్చింది రెండో చీమ.
'గట్టిగా మందలించి వదిలి పెడదాం ' సముదాయించింది మూడో చీమ.
' వదిలేద్దామే, పాపం అదొక్కటే... మనం నలుగురం' జాలి చూపించింది నాలుగో పిపీలికం.
15. తాగుడు మానేయాలా?
తాగుడు మానేయాలంటే ఒకటే మార్గం ..
పెళ్లి కాక ముందు బాధ లో ఉన్నప్పుడూ, అయ్యాక సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి.
No comments:
Post a Comment