Sunday, March 1, 2009

కూసిన్ని జోకులు

6. ఆనందం !?

'ఏంటండీ మీరూ చనిపోయారా ?' అంతకు ముందే చనిపోయి దెయ్యంగా మారిన భార్య అంది భర్త తో .

' అవునే ... నువ్వు చనిపోయిన వెంటనే నా ప్రాణమూ పోయింది . ఒక్కోసారి అమితానందం కూడా ప్రాణం తీస్తుందనిఅర్ధం అయ్యింది ' బాధగా చెప్పాడా భర్త .


7. బాసురులు
  • మీరు చేస్తే 'తప్పు' ... అదే మీ బాసు చేస్తే 'పొరబాటు'.
  • ఏదైనా పని చెయ్యడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటే మీరు ' మరీ నిదానస్తులు ' . అదే బాస్ అయితే ' ఆచి తూచి ఆలోచించి పని చేస్తారు '.
  • చెప్పిన పని చెప్పిన సమయానికి మీరు చెయ్యలేకపోతే అది 'బద్ధకం'. బాస్ గారు చెయ్యలేక పొతే , ఆయన బిజీ గా వున్నట్లు .
  • కొంచెం స్వతంత్రించి నిర్ణయం తీసుకుంటే మీరు హద్దులు మీరుతున్నట్లే లెక్క . అదే పని అధికారి చేస్తే 'చొరవ ' అయిపోతుంది .
  • మీరు ఒకే మాటకు కట్టుబడితే అది 'మొండితనం '. అయ్యవారు చేస్తే ... ఆయన మాట మీద నిలబడే మనిషి .
  • మీరు మీ బాస్ ని ప్రసన్నం చేసుకోబోతే అది ' కాకా పట్టడం ' . అదేపని బాస్ పైవారి పట్ల చేస్తే అది 'కో -ఆపరేషన్ '.
పైన చెప్పినవన్నీ మొగుడు , పెళ్ళాలకు కూడా వర్తిస్తాయి . బాస్ స్థానం లో భర్త ఉంటాడంతే .

8
కొంటె కొటేషన్

దారి కాచి అటకాయించే దొంగలు జీవితం, డబ్బుఈ రెండింటిలో ఏది కావాలో తేల్చుకో అని బెదిరిస్తుంటారు . కాని భార్య ఛాన్స్ ఇవ్వదు.


9. ఎలకల బోను

ప్రేమ అనేది ఎలకల బోను లాంటిది. లోపలికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కాని అందులోంచి బయటపడటం ఓ పట్టాన కుదరదు. కొన్ని సార్లు ఎప్పటికీ సాధ్యం కాదు.

10. మంచి వార్త....!!
హాస్పిటల్ కు చెకప్ కోసం వెళ్ళిన పంకజం ముఖం వేలాడేసుకొని ఇంటికి తిరిగి వచ్చింది.
' ఒక మంచి వార్త , ఒక చెడ్డ వార్త' అని చెప్పింది భర్తతో.
' ఏమిటది?'
' నా మాట పడిపోతుందట. ఇంకా ఒకటి రెండు రోజులే నేను మాట్లాడగలిగేది...' దిగాలుగా అంది.
' అవునా?! మరి చెడ్డ వార్తేమిటి ? అడిగాడు భర్త






Monday, December 22, 2008

తెలుగు సినిమాల లిస్టు

1931 మొదలు ఇప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాల లిస్టు కోసం క్లిక్ చెయ్యండి : తెలుగు సినిమాలు

మహానటి సావిత్రి గారి కుమార్తె


నిన్న రాత్రి జీ టీవీ లో ప్రసారం అయిన 'స్వర నీరాజనం' కార్యక్రమానికి విచ్చేసిన మహానటి సావిత్రి గారి కుమార్తె శ్రీమతి విజయ ఛాముండేశ్వరి గారి ఫోటో

Thursday, December 11, 2008

ఈ వారం నాకు నచ్చిన జోక్స్

1. నిన్నే పెళ్ళాడుతా

ఇందిరాపార్కు, సాయంత్రం ఆరు గంటలు ....
" మా అమ్మకు కూడా నీవు బాగా నచ్చావు తెలుసా " మాధవ్ ముక్కు పిండుతూ గోముగా అంది రాధ.
"ఎంత నచ్చినా నేను మాత్రం నిన్నే చేసుకుంటాను రాధా" ఖచ్చితంగా చెప్పాడు మాధవ్ ముక్కు రుద్దుకుంటూ.


2. విప్పి చూడు

"డాక్టర్ , నాకు రోజురోజుకూ మతి మరుపు ఎక్కువవుతోంది. నడిరోడ్డు ఫై నడుస్తుంటానా.. హఠాత్తుగా ఆఫీసుకు వెళ్తున్నానో, ఇంటికి వెళ్తున్నానో మర్చిపోతాను..." వాపోయాడు భజగోవిందం.

" వెంటనే మీ కేరేజీ గిన్నె మూత తీసి చూడండి. గిన్నె ఖాళీ గా వుంటే ఇంటికి వెళ్తున్నట్లు. నిండుగా వుంటే ఆఫీసుకు వెళ్తున్నట్లు...." చెప్పాడు డాక్టర్ చాల నింపాదిగా.

౩. బ్రేక్ ఫెయిల్
"మీకేమైనా పిచ్చెక్కిందా ? ఏమిటా స్పీడు ? స్కూటర్ స్పీడు తగ్గించండి " అరిచింది
కాంతం .

"పిచ్చి మొద్దూ, బ్రేకులు ఫెయిల్ అయ్యాయే . ఆక్సిడెంట్ కాక ముందే మనం ఇంటికి చేరుకోవాలనీ ..."చెప్పాడు కాంతం భర్త .

4. ఏదైనా దేశానికి మేలే

వైకుంఠం కొత్తగా మిలటరీలో చేరాడు. ఆయనకొక గన్ ఇవ్వగానే, ఎదురుగా వున్న ఆఫీసురుతో ,"శత్రువుతో పోరాడినప్పుడు గురి ఎటువైపు పెట్టాలి సార్?" అని అడిగాడు.

వైకుంఠాన్ని ఎగాదిగా చూసి " ఎటు వైపు పెట్టినా దేశానికీ మేలే" చిరాగ్గా గొణుగుతూ
ముందుకు కదిలాడు ఆఫీసర్ .

5. వైఫంటే

" అసలు నీకు వైఫంటే అర్ధం తెలిసేడిస్తేగా ?" కోపంగా అంది కాంతం.
" నిన్ను పెళ్లి చేసున్నాకే తెలిసింది. (W) వితవుట్ (I) ఇన్ఫర్మేషన్(F) ఫైటింగ్ (E) ఎవిరి టైం ....అని "మరింత కోపంగా చెప్పాడు జోగినాథం.

" కాదు... (w)విత్ (I)ఇడియట్ (F)ఫర్ (E)ఎవర్ " అరిచింది కాంతం .




Sunday, December 7, 2008

TEAMMATES!... TEA MATES





teatime on logs under trees .. cool ..with tea

rain cannot stop tea meeting!!



                                            enjoy sundays with more fun on logs with tea!!

Tuesday, November 25, 2008

Pics of my school






                                                                     MY SCHOOL....!!



 
                                               







M.P.P.SCHOOL (L.E.), CHANDAVARAM,
  NADENDLA MANDAL,
   GUNTUR DISTRICT