Monday, November 12, 2012

ఓదార్పు (కథ- కల్పితం కాదు )

కళ్యాణ్ స్కూల్ నుండి బిక్క మొహం వేసుకొని వచ్చాడు.
"కళ్యాణ్ ఏమైందమ్మా ఎందుకలా  ఉన్నావ్?"
.......
"చెప్పు నానా ! ఏమైంది?"
"ఎస్సే  రైటింగ్ పోయింది డాడీ.."  గొంతు పెగలటం లేదు. మంచం మీద  వాలిపోయాడు .
"ఓహో! నిన్న నెట్ లో సెర్చ్ చేసావు...నెహ్రు గారి గురించీ...నోట్  బుక్ లో రాసుకున్నావు... అందుకేనా ?"
...... తలూపాడు . కళ్ళు ఎరుపెక్కాయి.. .. కళ్ళు నులుముకుంటున్నాడు.
"వద్దమ్మా .. కళ్యాణ్! పొతే పోయిందిలే,దానికి ఎందుకంతగా బాధపడతావ్?"
"ఫస్ట్  ఎవరోచ్చారు?"
కన్నీరు కట్టలు తెంచుకుంది...ఎక్కిళ్ల మధ్య ... " సలీం ఫస్ట్ , ఆకాష్ సెకండ్ వచ్చారు డాడీ ."
వాళ్ళిద్దరూ కళ్యాణ్ కి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళకి వచ్చాయి. వీడికి బహుమతి రాలేదు.
"స్పోర్టివ్ గా  తీసుకో, పార్టిసిపేషన్  ఇంపార్టెంట్ .. గెలుపోటములు కాదమ్మా!"
....ఎక్కిళ్ళు....
"సలీం ఎక్కువగా రాయలేదు డాడీ! తనకొచ్చింది రాసేసాడు. కాకపోతే రైటింగ్ బాగుంది."
....ఎక్కిళ్ళు అడ్డమొస్తున్నాయి ...
"నేను చాల రాశాను. నా రైటింగ్ బాగాలేదు. లైన్స్ వంకర పోయాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయని సార్  చెప్పారు."
"పర్వాలేదు. నీ  వయసులో ఈ మాత్రం పాల్గొని సొంతంగా రాశావు . మా అప్పుడు మాకు ఏమీ  తెలియదు . నువ్వు చాల బెటర్ మా మీద."
....ఎక్కిళ్ళు...
"నీ  పొరపాటు అర్ధం అయింది కదా! రైటింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకో, ఈ సారి ఇంకా బాగా చేద్దువుకాని..."
...ఎక్కిళ్ళు ఆగటంలా..
"అయ్యో! చాల సీరియస్ గా ప్రిపేర్ అయినట్లున్నావు. దిగులు పడకు నానా ! రిలాక్స్ అవు ! .." అంటూ దగ్గరకు తీసుకోని ముద్దుపెట్టుకున్నా.
 ....ఉహు ... ఎక్కిళ్ళు  పెడుతూనే ఉన్నాడు తలుచుకొని.
"బాలల దినోత్సవం కోసం మీరంతా ఉత్సాహంగా ఉండాలని పోటీలు పెడుతుంటే హుషారుగా ఉండాలి గానీ, ఇలా బాధ పడకూడదు నానా !"
.....
....
" మరీ ! సలీం నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా!"
"అవును"
"నిన్నేమీ  బ్లేం చేయలేదు ఇంతవరకు. బాగా ఉంటాడు నీతో.మన ఇంటికి వస్తుంటాడు.నువ్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తావు. మీరు కలిసి ఆడుకుంటారు. కలిసి భోజనం కూడా చేస్తారు కదా?"
"ఔను డాడీ!"
"మరీ! ఒక వేళ నీకు బహుమతి వచ్చి, తనకు రాకపోతే, తను ఇలాగే  ఏడుస్తాడు కదా!"
"అవును" కళ్ళు నులుముకుంటూ అన్నాడు.
"మరి నీ ఫ్రెండ్ అలా  ఏడుస్తుంటే నీకు ఇష్టమేనా...?"
కాదంటూ తల అడ్డంగా ఉపాడు .
"అందుకే ఇలాంటి బాధ నీ  ఫ్రెండ్ కి వద్దు. ఈ పోటిలో గెలిచిన అతనికి సంతోషమే నువ్విచ్చే బహుమతి..!  సరేనా!?"
...స్థిమిత పడ్డాడు ... సరేనన్నాడు...
కాసేపు టీ .వీ . చూస్తానంటూ లేచి వెళ్ళాడు నెమ్మదిగా...
వాడినే చూస్తున్నా... చెమ్మగిల్లిన కళ్ళతో .. వాడిని ఓదార్చగలిగానన్న తృప్తి.


Monday, October 31, 2011

బ్యూటీ అఫ్ తిరుమల హిల్స్



ఆ తిరుమల కొండల అందాన్ని చూతము రారండి!

Monday, October 3, 2011

Thursday, April 30, 2009

మరి కాసిన్ని జోకులు

11. ఉచిత సలహా
కాలు విరిగిన వ్యక్తిని పరీక్షిస్తున్నాడు డాక్టర్ వెంగళప్ప.
' రెండు చోట్ల విరిగిందని నా అనుమానం డాక్టర్.' చెప్పాడు వ్యక్తి బాధగా.
'తెలిసొచ్చింది కదా... రెండు చోట్లకూ మళ్ళీ ఇంకెప్పుడూ వెళ్ళకండి.' సలహా ఇచ్చాడు వెంగళప్ప.
12.
తెలిసి తెలిసీ ..

మొదటి సారి తన బాయ్ ఫ్రెండ్ శ్రీను తో పిక్నిక్ కు వెళ్ళింది లీల. అక్కడ ఏకాంత వాతావరణం లో శ్రీను ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత లీల కుమిలి పోతూ ఏడవటం ప్రారంభించింది.
'వద్దూ వద్దనుకుంటూనే పొరబాటు చేశా. పాపమని తెలిసీ మళ్ళీ అదే తప్పు ... నాకు నిష్కృతి లేదు' అంది లీల ఆవేశంగా.

'అదేంటి మనం తప్పు చేసింది ఒక్కసారేగా?! ఆశ్చర్యంగా అన్నాడు శ్రీను.
'ఇంటికేళ్లేలోపు ఇంకోసారి అవేశాపడక పోతావా?' నమ్మకం గా అంది లీల.


13. ఆడవాళ్లకు మాత్రమే

సేవింగ్స బాండ్ కి మగ వారికి తేడా..?
సేవింగ్స్ బాండ్ కొన్నేళ్ళకైనా మెచ్యూర్ అవుతుంది.
మగ వాళ్ళకీ పార్కింగ్ స్థలాలకీ పోలిక?
మంచివన్నీ ముందే అయిపోతాయి. మిగిలి ఉన్న వాటికి ఎదో లోపం/ సమస్య ఉంటుంది.
క్యాండిల్ లైట్ డిన్నర్ గురించి మగవాళ్ళు ఆలోచించే దెప్పుడు
కరెంట్ పోయినప్పుడు ( వాళ్ళకు రొమాంటిక్ థాట్స్ కూడానా!)
చక్కగా డ్రెస్ చేసుకున్న మగవాణ్ణి చూడగానే ఏమనిపిస్తుంది ?
ఇతని భార్యకు మంచి
టేస్ట్ ఉంది , డ్రెస్ సెలక్షన్ బాగా తెలుసూ ... అని.
ఆడవాళ్ళు తెలివిగా కన్పించే కన్నా, అందంగా కనిపించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారెందుకు?
మగవాళ్ళకు బుర్ర లేక పోయినా కళ్ళుంటాయికదా.

14. క్షమించేద్దాం
అడవిలో నాలుగు చీమలు వెళ్తున్నాయి. తోవలో వాటికీ ఏనుగు ఎదురైంది. ఎవరు పక్కకు తోలగాలనే సమస్య
తలెత్తింది. మర్యాదగా అడ్డు లెమ్మంది గజ రాజు.
'మనల్నే ఎదిరిస్తుందా?
దీన్ని చంపి తీరుతాను ' ఆవేశపడిందో చీమ.
'ఎందుకు? కాళ్ళు
విరగ్గొడితే సరి ' సలహా ఇచ్చింది రెండో చీమ.
'గట్టిగా మందలించి
వదిలి పెడదాం ' సముదాయించింది మూడో చీమ.
' వదిలేద్దామే, పాపం అదొక్కటే... మనం నలుగురం' జాలి చూపించింది నాలుగో పిపీలికం.

15. తాగుడు
మానేయాలా?

తాగుడు
మానేయాలంటే ఒకటే మార్గం ..
పెళ్లి
కాక ముందు బాధ లో ఉన్నప్పుడూ, అయ్యాక సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి.





Sunday, March 1, 2009

కూసిన్ని జోకులు

6. ఆనందం !?

'ఏంటండీ మీరూ చనిపోయారా ?' అంతకు ముందే చనిపోయి దెయ్యంగా మారిన భార్య అంది భర్త తో .

' అవునే ... నువ్వు చనిపోయిన వెంటనే నా ప్రాణమూ పోయింది . ఒక్కోసారి అమితానందం కూడా ప్రాణం తీస్తుందనిఅర్ధం అయ్యింది ' బాధగా చెప్పాడా భర్త .


7. బాసురులు
  • మీరు చేస్తే 'తప్పు' ... అదే మీ బాసు చేస్తే 'పొరబాటు'.
  • ఏదైనా పని చెయ్యడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటే మీరు ' మరీ నిదానస్తులు ' . అదే బాస్ అయితే ' ఆచి తూచి ఆలోచించి పని చేస్తారు '.
  • చెప్పిన పని చెప్పిన సమయానికి మీరు చెయ్యలేకపోతే అది 'బద్ధకం'. బాస్ గారు చెయ్యలేక పొతే , ఆయన బిజీ గా వున్నట్లు .
  • కొంచెం స్వతంత్రించి నిర్ణయం తీసుకుంటే మీరు హద్దులు మీరుతున్నట్లే లెక్క . అదే పని అధికారి చేస్తే 'చొరవ ' అయిపోతుంది .
  • మీరు ఒకే మాటకు కట్టుబడితే అది 'మొండితనం '. అయ్యవారు చేస్తే ... ఆయన మాట మీద నిలబడే మనిషి .
  • మీరు మీ బాస్ ని ప్రసన్నం చేసుకోబోతే అది ' కాకా పట్టడం ' . అదేపని బాస్ పైవారి పట్ల చేస్తే అది 'కో -ఆపరేషన్ '.
పైన చెప్పినవన్నీ మొగుడు , పెళ్ళాలకు కూడా వర్తిస్తాయి . బాస్ స్థానం లో భర్త ఉంటాడంతే .

8
కొంటె కొటేషన్

దారి కాచి అటకాయించే దొంగలు జీవితం, డబ్బుఈ రెండింటిలో ఏది కావాలో తేల్చుకో అని బెదిరిస్తుంటారు . కాని భార్య ఛాన్స్ ఇవ్వదు.


9. ఎలకల బోను

ప్రేమ అనేది ఎలకల బోను లాంటిది. లోపలికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కాని అందులోంచి బయటపడటం ఓ పట్టాన కుదరదు. కొన్ని సార్లు ఎప్పటికీ సాధ్యం కాదు.

10. మంచి వార్త....!!
హాస్పిటల్ కు చెకప్ కోసం వెళ్ళిన పంకజం ముఖం వేలాడేసుకొని ఇంటికి తిరిగి వచ్చింది.
' ఒక మంచి వార్త , ఒక చెడ్డ వార్త' అని చెప్పింది భర్తతో.
' ఏమిటది?'
' నా మాట పడిపోతుందట. ఇంకా ఒకటి రెండు రోజులే నేను మాట్లాడగలిగేది...' దిగాలుగా అంది.
' అవునా?! మరి చెడ్డ వార్తేమిటి ? అడిగాడు భర్త